Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందశాతం పన్ను వసూల్ అయ్యేనా?

వందశాతం పన్ను వసూల్ అయ్యేనా?

- Advertisement -

ఇప్పటివరకు 70 శాతం పూర్తి

స్పెషల్ డ్రైవ్ లో కార్యదర్శులు

మిగిలింది నాలుగు రోజులే

నవతెలంగాణ-మల్హర్ రావు

గ్రామాల్లో మౌలిక వసుతుల కల్పనకు గ్రామపంచాయతీల్లో నిల్వ ఉండే నిధులే ప్రధానం. ఇంటిపన్ను వసూలు చేస్తే అవి గ్రామపంచాయతీ ఖాతాల్లో నిల్వగా ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సర మార్చి 31లోగా వందశాతం ఇంటి పన్ను వసూలుకు అధికారులు లక్ష్యం విధిస్తుండగా.. సిబ్బంది అందుకోసం కృషి చేస్తుండటం ఆనవాయితీ. మండలంలోని ఇప్పటికే 70 శాతం ఇంటిపన్ను వసూలు కావడం. ఈ నెల 31 గడువు కావడంతో అధికారులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిహిస్తుండటం విశేషం. మండలంలో 15 గ్రామాలు ఇంటిపన్ను రూ.29 లక్షల,67 వేలు వసూల్ చేయాలనే లక్ష్యం ఉంది. కానీ ఇప్పటికీ రూ.20 లక్షల,63 వేలు వరకు 70 శాతం వసూల్ చేశారు.

తుది గడువు నాలుగు రోజులే

మండలంలో 15 గ్రామాల్లో 9,548 ఇళ్లు ఉన్నాయి. ఇంటిపన్ను ఏడాదికి రూ.29,67,907 రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.ఇంటిపన్ను వందశాతం వసూలు చేయాలని మండలాధికారులు, కార్యదర్శులతో పాటు పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మార్చి 31 వరకు వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలనే లక్ష్యం విధించారు. కాగా ఇప్పటి వరకు రూ.20.67 లక్షలు వసూల్ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంటిపన్ను వసూలకు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో మండల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటిపన్ను వసూళ్లపై పర్యవేక్షిస్తున్నారు.

ఇంటిపన్నుపై ప్రత్యేక దృష్టి సారించాం: ఎంపిఓ..విక్రమ్ కుమార్

గ్రామాల్లో కార్యదర్శులతో పాటు సిందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, ఇప్పటివరకు 70 శాతం వసూలు చేశాం. ఈ నెలఖారు వరకు వందశాతం ఇంటిపన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో ముందకు వెళ్తున్నాం. వీలైనంతా త్వరగా వందశాతం వసూలు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. పన్నులు చెలింపులకు గ్రామాల్లో ప్రజలు సహ కరించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -