Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశాల సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా.?

ఆశాల సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా.?

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ- కంఠేశ్వర్ 

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18000 చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం వలన తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనటానికి సిద్ధపడ్డా ఆశ వర్కర్లను, రాత్రి నుండే అక్రమంగా అరెస్టులు చేస్తూ జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో నేర్పొందించారని ఇది ఏ రకంగా ప్రజాపాలనవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు.

అరెస్టై పోలీస్ స్టేషన్లో ఉన్న ఆశ వర్కర్లను ఆయన పరామర్శించటం తో పాటు పోలీస్ అధికారులు మాట్లాడటం జరిగింది. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు దర్పణం ఎడల తమ గోడును వెల్లబోసుకోవటానికి మహిళలు ఆశ వర్కర్లు సిద్ధపడి హైదరాబాద్ వెళ్లటానికి ప్రయత్నించిన సందర్భంలో వారిని ఎక్కడికక్కడ ఇండ్ల వద్ద బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించారని. ఒకవైపు ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు అని ప్రకటనలు ఇస్తూనే మరొకవైపు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలు లేకుండా నియంతృత్వంగా పోలీసుల ద్వారా అరెస్టులు చేసే నిర్బంధించటం ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుందని మహిళలను రాత్రులందు స్టేషన్లో బంధించటం ఎక్కడి ప్రజాపాలనాన్ని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కర్ల సమస్యలను పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకులు సుకన్య, లక్ష్మి, తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -