Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పది పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. పరీక్ష వ్రాస్తున్న విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాల పై విద్యా శాఖ అధికారి రాజును అడిగి తెలుసుకొని, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన  మెడికల్ క్యాంప్ ను పరిశీలించి    విద్యార్ధుల ఆరోగ్య , భద్రత దృష్ట్యా వైద్య సిబ్బంది, అవసరమైన  మెడిషన్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, మండల విద్యాశాఖ అధికారి రాములు, నాయక్ సంబంధిత అధికారులు  ఉన్నారు.           

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -