Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంరామ్ మందిర్ విరాళాల చోరీ.. ప్రధాని స్పందించాలి

రామ్ మందిర్ విరాళాల చోరీ.. ప్రధాని స్పందించాలి

- Advertisement -
  • కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ-హైదరాబాద్: రామ్ మందిర్ విరాళాల చోరీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలో స్పందించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం డిమాండ్ చేశారు. ప్రజల తరపున ప్రతిపక్షం ఈ అంశాన్ని లేవనెత్తిందని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో భద్రపరిచిన నగలు, వెండి, బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువుల అపహరణ పై సమగ్ర విచారణ జరగాలని ఖర్గే జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆలయ వ్యవహారాలను నిర్వహించే ట్రస్ట్ పనితీరుపై ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. ఆలయం నుంచి ఆభరణాలు, వెండి, బంగారం, నగదు, బంగారు ఇటుకలు, బంగారు రామచరితమానస్ గ్రంథంతో సహా వివిధ విలువైన వస్తువులు కన్పిండచంలేదని, వాటిని పరిరక్షించంలో ఆలయా ట్రస్ట్ విఫలమైందని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -