- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేష్ అమ్మమ్మ కారుపోతుల కాంతమ్మ శనివారం కన్నుమూశారు. తాటిపాముల గ్రామంలో కాంతమ్మ భౌతికకాయానికి నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్, జీఎం లింగారెడ్డి, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు జి. వేణుమాధవ్ రావు, బి. బసవపున్నయ్య నివాళులు అర్పించారు.
అనంతరం సీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ తాటిపాముల గ్రామంలో కాంతమ్మ సీపీఐ(ఎం)ని నిర్మించటంలో, కుటుంబ సభ్యులందరిని పార్టీ సభ్యులుగా మలచటంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. నవతెలంగాణ పత్రిక తరపున ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాహనుభూతి తెలిపారు.

- Advertisement -


