- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోం గార్డ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోం గార్డ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మియాపూర్ పోలీసులు హోమ్ గార్డ్ ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
- Advertisement -


