నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర పుణేలో ఆదివారం విమానం ప్రమాదం చోటుచేసుంది. మధ్యాహ్నం బారామతి విమానాశ్రయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదని సంబంధింత అధికారులు తెలియజేశారు. ప్రమాద ధాటికి స్వల్పంగా విమానం దెబ్బ తిన్నంది. ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా విమానం అదుపు తప్పి ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు.
బారామతి శిక్షణలో భాగంగా ఎయిర్‌ఫీల్డ్‌లో VT-SEX అనే విమానం రన్‌వే పై అదుపుతప్పిందని, ప్రమాద సమయంలో విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయిఫోడే, క్యాడెట్ అభిజీత్ జుంద్రే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మీడియాకు తెలిపారు.



