- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. జజాన్ ప్రాంతంలోని అరామ్‌కో కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ అధికారులు తెలిపారు.
- Advertisement -



