- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ట్రిబ్యునళ్ల సంస్కరణలు, గనులు, ఖనిజాల చట్ట సవరణ, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లులు కూడా చర్చకు రానున్నాయి. రాజ్యసభలో బ్యాంకర్ల పుస్తకాల నిరూపణ బిల్లు, పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లులు పరిశీలనకు రానున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు అధికారిక పత్రాలను సభ సమక్షంలో ఉంచనున్నారు.
- Advertisement -



