- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని గిండి సమీపంలో అమీన్ ప్రయాణిస్తున్న పోర్షే కారును వాగాన్ ఆర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు అతడి మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



