నవతెలంగాణ-హైదరాబాద్ : వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ జి.వేణు తెలిపిన వివరాల ప్రకారం.. జఫర్‌గఢ్‌కు చెందిన కోల సోని(28)కి స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలకు చెందిన తాడెం అనిల్(35)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లి నిశ్చయించిన సమయంలో 6 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, వంద గజాల ప్లాట్‌ను వరకట్నం కింద రాసి ఇచ్చారు. అనిల్ గత కొద్ది రోజుల కిందట సొంత ఖర్చుల కోసం 6 తులాల బంగారు అమ్ముకున్నారు. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం సాగిస్తూ.. భార్యను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 15 రోజుల కిందట అతడు అదనపు కట్నం తీసుకురావాలని సోనిని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శనివారం పురుగుమందు తాగారు. వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలి తండ్రి ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
వరకట్న వేధింపులు.. పురుగుమందు వివాహిత ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


