Monday, August 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర అగ్నిప్రమాదం..16 మంది సజీవదహనం

ఘోర అగ్నిప్రమాదం..16 మంది సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని మూసా సానియా ప్రాంతంలో ఉన్న ఒక సోఫా ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది బంగ్లాదేశీ కార్మికులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతులను గుర్తించే ప్రక్రియతో పాటు చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. మృతదేహాలను త్వరలోనే స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -