Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోశాల ఎరువుకు వేలంపాట

గోశాల ఎరువుకు వేలంపాట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ గోశాలలో ఆదివారం గోశాల ఎరువు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాట గోశాల చైర్మన్ గాండ్ల సంజయ్ , అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. గోశాల ఆవరణంలో ఎరువు కుప్పలు మూడు ఉండగా ఒకటి రూ.35,100 వేలంపాట పాడింది. దీనిని శ్యాం బండివార్ దక్కించుకున్నారు. అదేవిధంగా మరో రెండు కుప్పలు ఒకటి రూ.20,500, మరొకటి రూ.7000 ఈ రెండింటిని కూడా వెంకట్ బండి వారు దక్కించుకున్నారు. మూడు కుప్పల వేలం ఆదాయం రూ.62,600 వచ్చినట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు. ఈ వేలం పాటలో గోశాల కమిటీ సభ్యులు పలువురు కొనుగోలు  దారులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -