Monday, March 30, 2026
E-PAPER
Homeదర్వాజప్రపంచ శాంతి కోసం అని చెబుతాడు

ప్రపంచ శాంతి కోసం అని చెబుతాడు

- Advertisement -

అతని ఒళ్ళునిండా యుద్ధ ట్యాంకులు
యుద్ధం చేయడం అతని వృత్తి
తన కోసం యుద్ధం చేస్తాడు
తన పెత్తనం కోసం యుద్ధం చేస్తాడు !
అనవసరంగా యుద్ధం చేస్తాడు
అవకాశం కోసం యుద్ధం చేస్తాడు
మాట విననందుకు యుద్ధం చేస్తాడు
ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తాడు
పొట్ట నింపుకోవడానికి యుద్ధం చేస్తాడు
యుద్ధం చేయడం అతని వృత్తి, అతని ప్రవృత్తి !
యుద్ధం చేసి చేసి యుద్ధానికి ప్రతిరూపమైనాడు
అతని ఒళ్ళునిండా యుద్ధ ట్యాంకులే
అతడే ఒక పెద్ద విస్పోటనం
యుద్ధం చేస్తుంటే ఎవరు చనిపోయినా
అతడు పట్టించుకోడు
కూలిన భవనాలు సమాధులవుతున్న
అతడు పట్టించుకోడు!
యేరులై పారుతున్న నెత్తురునిండా అతనున్నాడు
గుట్టల్లా పడిన శవాలకు ఆద్యుడు అతనే
యుద్ధం, యుద్ధం అని రాత్రి పూట
కలలో కూడా పళవరిస్తాడు
నోటినిండా పెట్రోల్‌ పోసుకుని
కడుపు నిండా తాగుతాడు
ప్రాణాలను మట్టిలో కలిపి
శవాల దిబ్బలు చేస్తున్నాడు
అదుగో అతనే!
వల్లకాడైన దేశం వొడ్డున కూచుని
ఇంకో దేశంపై యుద్ధం చేస్తున్నాడు
ఈ యుద్ధాలు ఎందుకని
ఎవరైనా అడిగితే
ప్రపంచ శాంతి కోసం అని చెబుతాడు !!

  • ఎదిరెపల్లి కాశన్న
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -