Monday, March 30, 2026
E-PAPER
Homeసినిమా'సుయోధన'కి రెస్పాన్స్‌ అదుర్స్‌

‘సుయోధన’కి రెస్పాన్స్‌ అదుర్స్‌

- Advertisement -

ప్రజ్వలా లైన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్‌ హీరో, హీరోయిన్లుగా, సాయికుమార్‌, ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. వైఎస్‌ మాధవ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.
ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు.
నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ,’మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్‌ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్‌ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్‌ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈసారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామిగా సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్‌ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్‌ చేస్తాం. ఈసారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్‌తో ఉంటుంది’ అని తెలిపారు.
‘చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. ఈ చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్‌ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్‌ మాధవ్‌ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్‌ చాలా బాగుంది. అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది’ అని డిస్ట్రిబ్యూటర్‌ బాపిరాజు చెప్పారు.
డైరెక్టర్‌ వైఎస్‌ మాధవ్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి షోకు స్క్రీన్స్‌ పెరుగుతున్నాయి. ఓవర్సీస్‌ లోనూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్‌ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్‌ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీడియా రీచ్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
‘ఓ మంచి కాన్సెప్ట్‌తో మేం చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆమోదించారు. ప్రతి చోటా సినిమాకి అద్భుత స్పందన రావడం మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఇకపై కూడా ఇదే రీతిలో మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని మేకర్స్‌ తెలిపారు.
ప్రియదర్శి, ద్రిషిక చందర్‌, సాయి కుమార్‌, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్‌, రాజశ్రీ నాయర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ : జై క్రిష్‌, డీఓపీ : కార్తీక్‌ కొప్పెర, ఎడిటర్‌ : ఛోటా కె ప్రసాద్‌, ఆర్ట్‌ : బ్రహ్మ కడలి, లిరిక్స్‌ : రామజోగయ్య శాస్త్రి, నిర్మాత : బోసుబాబు నిడుమోలు, దర్శకత్వం: వై ఎస్‌ మాధవ్‌ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -