- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో 10 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తనను బెదిరించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విశాఖలోని MVP పోలీసులు రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన దాదాపు రెండు నెలల క్రితం జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



