Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపంజాగుట్ట శ్మశానవాటికలో శిశువు మృతదేహం మాయం..

పంజాగుట్ట శ్మశానవాటికలో శిశువు మృతదేహం మాయం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: పంజాగుట్ట శ్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆరు నెలలకే జన్మించిన కవలలు అనారోగ్యంతో ఒక రోజు వ్యవధిలో మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని రూ.2,500 తీసుకుని శ్మశానవాటికలో సిబ్బంది ఖననం చేశారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో.. ఇద్దరినీ ఒకేచోట ఖననం చేయించేందుకు కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు వచ్చారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అవేదనకు గురై.. శ్మశానవాటిక సిబ్బందిని నిలదీశారు. ‘మా బిడ్డ మృతదేహం ఏమైంది?’ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -