- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజమండ్రిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కాతేరు వద్ద గామన్ బ్రిడ్జి సమీపంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో.. పెద్దలు అంగీకరించకపోవడమే కారణమని తెలుస్తోంది. యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకోవడం లేదా హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడు పురుగులమందు తాగి, చేతిపై బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



