నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూర్లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై మాట్లాడారు.
‘‘సర్’ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో నాది కూడా ఉంది. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను. ఇక్కడే నివసించాను. చదువంతా ఇక్కడే పూర్తయింది. నటన నేర్చుకుంది కూడా ఇక్కడే. అన్నిటికంటే ముఖ్యంగా.. నేను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. అయినా నా ఓటును తొలగించారు’’ అని ఆ వీడియోలో చెప్పారు. మళ్లీ ఓటర్ కార్డు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారో అని వ్యంగ్యంగా అన్నారు. తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పారు.



