Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయంనేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

నేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్‎లోని రెంకోజీ ఆలయం నుండి భారతదేశానికి తరలించే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్లాఫ్ తన తండ్రి అస్థికలను మాతృభూమికి తీసుకురావాలని, గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన కోర్టు, కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది, వివిధ కమిషన్లు వేర్వేరు నిర్ధారణలకు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -