నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ సభ్యులు దీపాదాస్ మున్షీతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళలో ఆదివారం భేటీ అయ్యారు. ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పతనంతిట్ట జిల్లాలోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడీఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్‌కు మద్దతుగా వివిధ ప్రాంతాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడగల శక్తి కాంగ్రెస్‌కే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీతో పొంగులేటి భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



