Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకులాంతర వివాహాలు చట్టబద్ధమే

కులాంతర వివాహాలు చట్టబద్ధమే

- Advertisement -

హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కులాంతర వివాహాలు సమాజ అభ్యుదయానికి ఎంతో దోహదం చేస్తూ, రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైనవనీ, ఈ ఆదర్శ వివాహాలను అందరూ ప్రోత్సహించాలని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెడ్మకి రేణుక ఆడెపు రవితేజల కులాంతర ఆదర్శ వివాహం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్‌), ఎస్వీకేల ఆధ్వర్యంలో నిర్వహించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు దండలు మార్పించి ప్రమాణ పత్రాలు చదివించారు. అనంతరం జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ పూర్వకాలంలోనే కులాంతర వివాహాలు జరిగాయని తెలిపారు. వివాహానికి కులం, మతమనే అడ్డుగోడలుండకూడదని చెప్పారు. శాస్త్రీయంగా కుల మతాంతర వివాహాలు చేసుకున్న వారి పిల్లలు విజ్ఞానులుగా అభివృద్ధి చెందుతున్నారని గుర్తు చేశారు. ఎస్వీకే కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ మాట్లాడుతూ హంగు ఆర్భాటాలతో మన దేశంలో వివాహలు జరుగుతున్నాయని చెప్పారు.

ఆదర్శ వివాహాలన్నీ అభ్యుదయ కరమైనవని వాటిని ప్రోత్సహించడానికి పౌర సమాజం ముందుకు రావాలని కోరారు. టీపీఎస్‌కే రాష్ట్ర కన్వీనర్‌ జి రాములు, టి స్కైలాబ్‌బాబు మల్లు లక్ష్మి మాట్లాడుతూ స్వకుల వివాహాలను నిషేధిస్తూ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కుల మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలన్నారు. కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఐద్వా ఎల్లప్పుడు ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మిట్టపల్లి రాజమల్లు, రాంపల్లి రమేష్‌, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి,రవితేజ తల్లిదండ్రులు ఆడెపు రజిత మోహన్‌ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -