Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి అధికారుల డుమ్మా

ప్రజావాణికి అధికారుల డుమ్మా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణిని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టారు. కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించడానికి అధికారులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఈ సమస్య ఇప్పటిది కాదని, చాలా రోజులుగా ప్రజావాణి సక్రమంగా జరగడం లేదని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పదించి, ప్రజావాణికి సంబంధిత అధికారులందరూ విధిగా హాజరై మా సమస్యల పరిష్రారానికి కృషి చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -