నవతెలంగాణ-మద్నూర్
డిమాండ్ల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులు చేయడం సరైన పద్దతి కాదని, ముందస్తు అరెస్టులతో ఉద్యమాలు ఆగవని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు ధూమ్ హనుమాన్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్నూర్ మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, మాజీ సర్పంచ్లను సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్లు ఛలో అసెంబ్లీ ఉండటంతో ఉద్యమకారులు తూమ్ హన్మండ్లు, మాలి శివరాం, మాజీ సర్పంచ్ దరాస్ సురేష్, గఫర్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాగా ఈ అరెస్టును వారు ఖండించారు.
ముందస్తు అరెస్టులతో ఉద్యమాలు ఆగవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



