గ్యాస్ స్టౌవ్‌లో ఉండే బర్నర్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. సమయానికి శుభ్రం చేయకపోతే గ్యాస్ కూడా అధికంగా ఖర్చవుతుంది. అందుకే గ్యాస్ బర్నర్స్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ముందుగా బర్నర్‌ని గ్యాస్ స్టౌవ్ నుంచి తీసి తర్వాత కాటన్ క్లాత్‌తో తుడవాలి. ఇప్పుడు ఒక స్పూను డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు కలపాలి. ఆ నీళ్లలో బర్నర్స్ వేయాలి. నీళ్లు చల్లారిన తర్వాత బర్నర్‌ను తీసివేసి స్క్రాచ్ బ్రైట్‌తో శుభ్రం చేయాలి. ఇది పేరుకుపోయిన మురికితో పాటు నల్ల మచ్చలను నిమిషాల్లో తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల బర్నర్ కొత్తదానిలా మెరుస్తుంది. గ్యాస్ కూడా వధా కాకుండా ఉంటుంది.
అలాగే నీటిని వేడి చేయండి ఒక టేబుల్ స్పూన్ డిష్ వాషర్ లిక్విడ్ తో పాటు దానికి కొద్దిగా సర్ఫ్ కలపాలి. ఈ నీటిలో ఒక నిమ్మకాయ రసం , టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు అందులో గ్యాస్ బర్నర్ ఉంచండి. 20 నిమిషాల తర్వాత బర్నర్‌ను బ్రష్‌తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లో బర్నర్ శుభ్రం అవుతుంది. గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ డిష్ వాషర్ లిక్విడ్ కలపాలి. ఇప్పుడు బర్నర్‌ని నీటిలో వేసి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత రాస్కోచ్ బ్రాట్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లో బర్నర్ శుభ్రం అవుతుంది.
ఇలా శుభ్రం చేద్దాం..
- Advertisement -
- Advertisement -



