- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 25 మంది లొంగిపోవడంతో పాటు 93 ఆయుధాలను, రూ.11.16 కోట్ల విలువైన 7.2 కిలోల బంగారాన్ని, రూ.2.90 కోట్ల నగదును అప్పగించినట్లు ఆ జిల్లా ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ వెల్లడించారు. దంతెవాడ జిల్లాలో ఐదుగురు, సుక్మాలో ఇద్దరు మహిళా మావోయిష్టులు, కాంకేర్ జిల్లాలోనూ ఇద్దరు లొంగిపోయారు. వారితో పాటు భారీగా ఆయుధాల డంపును బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఎస్పీ కిరణ్‌చవాన్ తెలిపారు.
- Advertisement -


