Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు.

ప్రజాధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -