Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్స్టేషన్‌ బెయిల్‌కు రూ.60వేల లంచం డిమాండ్‌

స్టేషన్‌ బెయిల్‌కు రూ.60వేల లంచం డిమాండ్‌

- Advertisement -

– ఏసీబీకి చిక్కిన వికారాబాద్‌ మహిళా పీఎస్‌ సీఐ,ఎస్‌ఐ
నవతెలంగాణ-వికారాబాద్‌

వికారాబాద్‌ పట్టణంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో రూ.20వేలు లంచం తీసుకుంటూ సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ ఇర్షద్‌పై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ విషయంలో మహిళా పోలీస్‌స్టేషన్‌ల్‌లో ఇర్షద్‌ తల్లి, అక్కాచెల్లెళ్లు మొత్తం 6 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంపై మాట్లాడటానికి వారిని సీఐ, ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఒక్కరికి రూ.పది వేల చొప్పున రూ.60వేలు డిమాండ్‌ చేయగా.. రూ.40వేలకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సీఐ, ఎస్‌ఐ రూ.20వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పీఎస్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -