– మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల
నవతెలంగాణ- నకిరేకల్
అధికారుల నిర్లక్ష్యం.. మిల్లర్ల దోపిడీతో పంట పండించిన రైతులు ఆగమవుతున్నారని మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు శాతం లోపు తాలు ఉన్నా ఎలాంటి ఆటంకమూ కలిగించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న నిబంధన ఉన్నా ఖాతరు చేయకుండా క్వింటాకు ఐదు కేజీలు తరుగు తీయడాన్ని తప్పుబట్టారు. కాంటాలు అయిన తర్వాత మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోకపోవడం వల్ల లారీ లోడులో ఐదు నుంచి పది క్వింటాలు అదనంగా తూకం తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కేంద్రాల్లో రైతులను నిలువునా దోచుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేంద్రాలలో దోపిడీని అరికట్టకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో రైతు సంఘం సీనియర్ నాయకులు బచుపల్లి ప్రకాష్‌రావు, యానాల క్రిష్ణారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు గింజల లక్ష్మి, నాయకులు వెంకట రంగారెడ్డి, చందు, సైదులు, రైతులు ఉన్నారు.
మిల్లర్ల దోపిడీతో అన్నదాత ఆగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



