నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఓ టూరిస్టు వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. కులాటి మలుపు (Kulati Bend) వద్ద రాగానే వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో, అందులోని ప్రయాణికులు వాహనంలోనే చిక్కుకుపోయారు. జిల్లా విపత్తు నియంత్రణ కేంద్రం నుండి సమాచారం అందగానే, సబ్-ఇన్స్పెక్టర్ మనీష్ భకుని నేతృత్వంలోని SDRF బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది.గాయపడిన బాధితులను సురక్షితంగా లోయ నుంచి వెలికితీశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలియజేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది.
ఉత్తరాఖండ్ లో టూరిస్టు వాహనం బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



