Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజల గొంతుక నవతెలంగాణ: ఆర్డీవో డీఎస్‌ వెంకన్న

ప్రజల గొంతుక నవతెలంగాణ: ఆర్డీవో డీఎస్‌ వెంకన్న

- Advertisement -

నవతెలంగాణ–పరకాల
నవతెలంగాణ పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తూ అనునిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని పరకాల ఆర్డీవో డీఎస్‌ వెంకన్న అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం నికరంగా నిలబడుతూ, సామాన్యుల వాణిని పాలకులు, అధికారుల వరకు చేరవేయడం అభినందనీయమన్నారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు సమస్యల పరిష్కారానికి వారధిగా మీడియా పనిచేస్తుందని తెలిపారు.

నవతెలంగాణలో ప్రచురితమయ్యే ప్రజా సమస్యల కథనాలు సంబంధిత శాఖల దృష్టిని ఆకర్షించి పరిష్కారానికి దోహదపడుతున్నాయని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో పత్రికల పాత్ర ఎంతో ముఖ్యమని ఆర్డీవో డీఎస్‌ వెంకన్న పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న నవతెలంగాణ మరింతగా ప్రజలకు చేరువై, సమాజంలోని అన్ని వర్గాల సమస్యలకు వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ నవతెలంగాణ పత్రిక యాజమాన్యం, సిబ్బంది మరియు పాఠకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -