Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంఇండిగో విమానం రద్దు..లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి ఓ ప్రయాణికురాలు నిరసన

ఇండిగో విమానం రద్దు..లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి ఓ ప్రయాణికురాలు నిరసన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భువనేశ్వర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం రద్దవడంతో ఓ ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం 2:35 గంటలకు భువనేశ్వర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూశారు. అయితే అధికారులు ప్రయాణీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం 5:30 గంటలకు విమానం రద్దయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ వద్దకు వెళ్లాల్సి ఉందని, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. CISF సిబ్బంది జోక్యం చేసుకుని ఆమెను సముదాయించారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -