Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంఓ మహిళ ఎస్ఐపై బీజేపీ ఎమ్మెల్యే కూతరు దాడి

ఓ మహిళ ఎస్ఐపై బీజేపీ ఎమ్మెల్యే కూతరు దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఓ మహిళ ఎస్ఐపై బీజేపీ ఎమ్మెల్యే కూతరు దాడి చేసింది. ఆలయంలో దర్శనం కల్పించడం ఆలస్యమైందనే నెపంతో సదురు ఎస్ఐ చంపపై కొట్టింది. ఈఘటన ఈనెల 12న జరిగింది. తాజాగా ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.

కర్నాటక మాండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని ఆరతి ఉక్కడ దేవాలయంలో మహిళ ఎస్ఐ సావిత పటేల్ విధులు నిర్వహిస్తోంది. బీమా అమవాస్య సందర్భంగా ఆరతి ఉక్కడ టెంపుల్ కు భారీగా భక్తులు తరలించారు.

ఈక్రమంలోనే అదే సమయంలో తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె, ఏసీపీ గౌతమ్ భార్య ఐశ్వర్య ఆలయానికి చేరుకున్నారు. వచ్చి రాగానే తనను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేసింది. భక్తుల రద్దీ కారణంగా ఆలయం లోపలికి ప్రవేశించడానికి ఆలస్యమైంది. దీంతో తీవ్ర ఆగ్రహాంతో డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ సావిత పటేల్ పై ఐశ్యర్య దాడి చేసింది. ఈ ఘటనపై సదురు ఎస్ఐ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ క్షమాపణలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -