నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని జుక్కల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, (Revenu staff), జిపిఓ లు (GPO, ఈ జి ఎస్ సిబ్బంది (EGS staff ) , ఐకెపి సిబ్బంది (IKP staff ) లతో ఈ కింది అంశాలైన గ్రామసభ , సెన్సెస్ , ఈజీఎస్ వర్క్, పైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు మరియు జనాభా లెక్కలు (సెన్సెస్ 2027), గ్రామసభలు నిబంధనల ప్రకారం తేదీల వారీగా నిర్వహించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి మూలమైన పలు శాఖల అధికారులు గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించి గ్రామాభివృద్ధికి తమ వంతుగా కృషిచేసి మంచి ఉద్యోగులుగా పేరు ప్రఖ్యాతులు గడించాలని అన్నారు. ఈ సమావేశంలో తాహసిల్దార్ మారుతి , డిప్యూటీ తాహసిల్దార్ హేమలత , ఎమ్మారై రామ్ పటేల్ , ఎఫ్ఏలు, ఏటీఎం తులసీదాస్, ఏపీవో వందేమాతరం తదితరులు హాజరయ్యారు.
అధికారులతో ఎంపీడీఓ శ్రీనివాస్ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



