– జుక్కల్ జెడ్ పి హెచ్ స్ పీఈటి దానయ్య వెల్లడి..
నవతెలంగాణ – జుక్కల్
20 సంవత్సరాల లోపు బాలురు మరియు బాలికల ఫ్రీస్టైల్ మరియు బాలుర గ్రీకో రోమన్ స్టైల్ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటిలు రేపు ఉదయం 9 గంటలకి బిచ్కుంద మండలం లోనీ కంధరపల్లి గ్రామం లో నిర్వహిస్తామని కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, కార్యదర్శి పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి దానయ్య,ట్రెజర్ హిమా బిందు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసక్తి కలిగి ఉన్న 20 సంవత్సరాలలోపు బాల బాలికలు ఈ రెజ్లింగ్ పోటీలో పాల్గొని వారి ప్రతిభను చాటుకునేందుకు గొప్ప అవకాశం కలుగుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలలో రెజ్లింగ్ మరియు ఆటల పోటీలలో క్రీడా నైపుణ్యాన్ని వెనుక తీసేందుకే గ్రామీణ ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ అన్నారు.
కందర్ పల్లిలో బాల బాలికలకు రెజ్లింగ్ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



