Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్‘ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీ’కి‘హిమాలయన్ సమర్పణ్ ధ్యానోగ్’ వ్యవస్థాపకులు ఎంపిక

‘ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీ’కి‘హిమాలయన్ సమర్పణ్ ధ్యానోగ్’ వ్యవస్థాపకులు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వానికి ఉత్కృష్టమైన గుర్తింపును ఇస్తూ, హిమాలయన్ సమర్పణ్ ధ్యానోగ్ వ్యవస్థాపకులైన శివకృపానంద్ స్వామిజీని తమ ప్రతిష్టాత్మక ‘ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీ సభ్యునిగా ‘ప్రపంచ ధ్యాన ఫౌండేషన్’ నియమించింది. ప్రపంచ మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించేందుకు ‘ప్రపంచ ధ్యాన ఫౌండేషన్’ చేపట్టిన ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’ను డిసెంబర్ 21గా యునెస్కో ప్రకటించిన కొద్దికాలానికే ఈ గౌరవం దక్కింది.

స్వామీజీ యొక్క ఆధ్యాత్మిక అంతర్దృష్టిని, దశాబ్దాల సేవను గుర్తించి,ప్రపంచ ధ్యాన దినోత్సవ కమిటీ, జంగ్టో సొసైటీ వారు,దక్షిణ కొరియాలోని సియోల్‌లో గల జంగ్టో సామాజిక, సాంస్కృతిక కేంద్రంలో 2026,మార్చి20-21 రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ సదస్సుకు ఆయనను ఒక విశిష్ట వక్తగా ఆహ్వానించారు.

గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న మహూది గ్రామ రహదారి సమీపంలో నివసించే ఆయన హిమాలయాలలో అనేక సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనలో గడిపి, అపారమైన జ్ఞానాన్ని పొందారు. ఆ జ్ఞానాన్ని ఆయన 31సం.గా ధ్యానం ద్వారా సమాజంతో పంచుకుంటున్నారు. స్వామిజీ వద్ద, 72దేశాలలోని సాధకులు పరివర్తనాత్మక ఆధ్యాత్మిక శిక్షణను పొందుతున్నారు. ఈ ఏడాది ప్రపంచ ధ్యాన దినోత్సవ సదస్సు,ప్రపంచంలో పెరుగుతున్న మానసిక, భావోద్వేగ, పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ ధ్యాన గురువులు,అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్త సాధకులను ఒకచోట చేర్చింది. ఫోరమ్ యొక్క లక్ష్యం తీర్చిదిద్దడంలో,ముఖ్యంగా ‘వసు’అనే విశ్వ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వామీజీ మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రపంచ సామరస్యాన్ని పెంపొందించడంలో భారతదేశ నాయకత్వాన్ని ఆయన తోడ్పాటు నొక్కి చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -