డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
నవతెలంగాణ – కట్టంగూరు
రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏట రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని,జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ ఇస్తామని ప్రకటించి నేడు ఉద్యోగాల భర్తీ చేయకుండా తాత్సరం చేస్తుందన్నారు.గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించాయని, నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది అన్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారనిఅన్నారు.
కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులుపొన్న శ్రీనివాస్, పున్న సురేష్, మండల రమేష్, వేణు,సాయి, నిమ్మనగోటి మహేష్, స్టాలిన్, నాగేష్,అశోక్ మల్లేష్ ఉన్నారు.



