నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
టీ ఫైబర్ నెట్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ కల్పించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి టెలికాం కమిటీ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ కల్పించడం ద్వారా బ్రాడ్ బాండ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సౌకర్యాలు మెరుగుపరచడం, నెట్వర్క్ కేబుల్స్ , వాటర్ పైప్ లైన్స్, భూగర్భ పవర్ కేబుల్స్ గల ప్రాంతాలలో త్రవ్వకాలు జరపగోరే స్థల యజమానులు/ఏజెన్సీస్ సి – బోర్డ్ యాప్ ఉపయోగించే విధంగా ప్రజలలో అవగాహన కల్పించడం వంటి విషయాలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, టి జి ఐ సి సి శాఖ, టీ ఫైబర్, బి ఎస్ ఎన్ ఎల్, రిలయన్స్ జియో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ఎయిర్టెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.



