Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాలుగు లేబర్ కోడ్ ల అమలును రద్దు చేయాలి

నాలుగు లేబర్ కోడ్ ల అమలును రద్దు చేయాలి

- Advertisement -

కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్  / భువనగిరి 

బీ జే పీ మోడీ ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు దేశంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో పాటు,అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కూడా కష్టాల్లోకి నెట్టబడుతారని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఫీయ బేగం,జిల్లా నాయకురాలు పి.పద్మ అన్నారు.

బుధవారం భువనగిరి కేజీబీవీ స్కూల్ లో గేట్ ముందు,మోడీ బీ జే పీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల అమలును వ్యతిరేకిస్తూ బ్లాక్ డే పాటించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ నాయకురాలు డి.భవాని, జి.భవాని,జె.పుష్ప, వి.మధులత,ఎం.మాధవి,ఎం.లావణ్య,బి.రోజా, జె.మాధవి,ఎస్.కే.షహీమ్ బేగం  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -