- Advertisement -
సీఐటీయూ మండల కార్యదర్శి అంజయ్య
నవతెలంగాణ- మిరుదొడ్డి
కార్మికుల హక్కులను కాలు రాస్తున్న నాలుగు లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి అంజయ్య అన్నారు. బుధవారం మిరుదొడ్డిలో మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు 2022ను వెనక్కి తీసుకోవాలన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడును వెంటనే రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల హక్కులను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



