Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..

- Advertisement -

ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్..
నవతెలంగాణ – చిన్నకోడూరు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం: గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో పంట చేతికి రానున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంగాపూర్‌లో మూతపడిన మిర్చి మార్కెట్ సమస్యను పరిష్కరించి, త్వరలోనే  అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పాలకవర్గ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -