Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వాతంత్ర్య దినోత్సవం రోజే అరెస్టులా..?: సీపీఐ(ఎం) నేతల ఆగ్రహం

స్వాతంత్ర్య దినోత్సవం రోజే అరెస్టులా..?: సీపీఐ(ఎం) నేతల ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అర్హులను తొలగించి తమ అనుచరులకు ఇండ్లు కేటాయిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో సీపీఐ(ఎం) నాయకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఐ(ఎం) నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఐ(ఎం) కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు.

ఈ క్రమంలో సీపీఐ(ఎం )నాయకుడు ఎండి సలీంను అరెస్టు చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీపీఐ(ఎం) నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్, అవుటర్ రవీందర్, బొల్లు రవీంద్రకుమార్ తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. నిరసనకు ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై సీపీఐ(ఎం) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ.. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో నల్లగొండలో పోలీసులకు, సీపీఐ(ఎం) నాయకులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -