Thursday, April 2, 2026
E-PAPER
Homeఆటలులక్నో తడబ్యాటు

లక్నో తడబ్యాటు

- Advertisement -

– అర్ధసెంచరీతో మెరిసిన
– ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం
లక్నో :
లక్నో సూపర్‌జెయింట్స్‌(ఎల్‌ఎస్‌జి) తొలి మ్యాచ్‌లోనే తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు ఎన్గిడి(3/27), నటరాజన్‌(3/29)కి తోడు కుల్దీప్‌ యాదవ్‌(2/31) కట్టడిగా బౌల్‌ చేశారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు 18.4ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో భాగంగా ఢిల్లీ జట్టు 26పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన సమీర్‌ రిజ్వీ అర్ధసెంచరీకి తోడు స్టబ్స్‌ మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ముఖ్యంగా రిజ్వీ(70నాటౌట్‌; 47బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌కి తోడు స్టబ్స్‌(39నాటౌట్‌; 32బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌) రాణించారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 119 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(7) రనౌట్‌ కావడంతో జట్టు వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత మార్‌క్రమ్‌(11), బడోనీ(0), పూరన్‌(8) నిరాశపరిచారు. దీంతో లక్నో 71పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో అబ్దుల్‌ సమద్‌(36), మిఛెల్‌ మార్ష్‌(35)కి తోడు షాబాజ్‌ అహ్మద్‌(15), ముకుల్‌ చౌదరి(14) లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో రాణించారు. కానీ చివర్లో షమీ(1), నోర్ట్జే(0), మొహిసిన్‌ ఖాన్‌(0) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరడంతో లక్నో ఇన్నింగ్స్‌ 141పరుగులకు ముగిసింది. ఛేదనలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కూ శుభారంభం దక్కలేదు. కెఎల్‌ రాహుల్‌(0)ను మహ్మద్‌ షమీ బౌల్డ్‌ చేయగా.. నిస్సంకను ప్రిన్స్‌ యాదవ్‌ త్వరగా పెవీలియన్‌కు పంపాడు. నితీశ్‌ రాణాకు తోడు కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌(0) డకౌట్‌ కావడంతో ఢిల్లీ జట్టు 26పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన సమీర్‌ రిజ్వీ కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము కానీయలేదు. ఫోర్లు, సిక్సర్లతో అర్ధసెంచరీ సాధించి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. లక్నో బౌలర్లు ప్రిన్స్‌ యాదవ్‌కు రెండు, షమీ, మొహిసిన్‌ ఖాన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సమీర్‌ రిజ్వీకి దక్కింది.

శ్రేయస్‌ అయ్యర్‌కు 12 లక్షల జరిమానా
గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జరిమానాకు గురయ్యాడు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతనికి రూ.12 లక్షల జరిమానా వేటు పడింది. ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 కింద ఈ సీజన్‌ తొలి నేరంగా పరిగణిస్తూ.. స్లో ఓవర్‌ రేటు కింద అయ్యర్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుచేసి విజయంతో టైటిల్‌ వేటను మొదలెట్టిన పంజాబ్‌ జట్టు గిల్‌ సేన నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి 19.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి బోణీ కొట్టిన విషయం తెలిసిందే.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: కెఎల్‌ రాహుల్‌ (సి)మొహిసిన్‌ ఖాన్‌ (బి)సిరాజ్‌ 0, నిస్సంక (సి)పంత్‌ (బి)ప్రిన్ష్‌ యాదవ్‌ 1, నితీశ్‌ రాణా (సి)అబ్దుల్‌ సమద్‌ (బి)మొహిసిన్‌ ఖాన్‌ 15, సమీర్‌ రిజ్వీ (నాటౌట్‌) 70, అక్షర్‌ పటేల్‌ (బి)ప్రిన్స్‌ యాదవ్‌ 0, స్టబ్స్‌ (నాటౌట్‌) 39, అదనం 20. (17.1ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 145పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/21, 3/25, 4/26
బౌలింగ్‌: షమీ 4-0-28-1, ప్రిన్స్‌ యాదవ్‌ 3-0-20-2, మొహిసిన్‌ ఖాన్‌ 4-1-19-1, నోర్ట్జే 4-0-39-0, షాబాజ్‌ అహ్మద్‌ 1-0-16-0, మార్‌క్రమ్‌ 1-0-13-0, అబ్దుల్‌ సమద్‌ 0.1-0-6-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -