రామన్నపేటలో జరిగిన
రాష్ట్ర మహిళా రైతు సదస్సులో కమిటీ ఎన్నిక
నవతెలంగాణ- రామన్నపేట
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌గా కందాల ప్రమీల, కోకన్వీనర్లుగా శీలం పకీరమ్మ, కొప్పుల రజిత, చీరిక అలివేలు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా సమ్మక్క, భూక్యా శ్రీదేవి, బొంతు సమత, ఉమ, ఊర్మిళ, గింజల లక్ష్మి, ఫైళ్ల భారతమ్మ, మోకు భవాని, బచ్చు శ్రీలత, నాగలక్ష్మి, అరుణ, రమాదేవి, బొబ్బ లక్ష్మి, పిట్టల సుభద్ర ఎన్నికయ్యారు. మార్చి 31న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరిగిన మహిళా రైతుల రాష్ట్ర సదస్సులో ఈ ఎన్నిక జరిగింది.
ఈ సదస్సులో రైతులు, మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ తెలిపారు. ఏప్రిల్ 11న కిసాన్ సభ ఏర్పడి 90 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13న జరిగే ధర్నాలో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.



