- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోతుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు. నందిగామకు చెందిన యాదగిరి(51) అనే రైతు నాలుగు రోజుల క్రితం పొలం నుంచి ఇంటికి వస్తుండగా కోతుల గుంపు అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మొదట ములుగు జిల్లా ఆస్పత్రికి, ఆపై వరంగల్ యంజీయం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం యాదగిరి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



