నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఊర చెరువులో వేలాది సంఖ్యలో గురువారం చేపలు మృత్యువాత పడ్డాయి. పెర్కిట్ ఊర చెరువు పైన ఆర్మూర్, పెర్కిట్లో గల పైన నివాస గృహాల ప్రాంతాల నుండి కలుషిత నీరు చెరువులో వచ్చి భారీగా చేరుతుండడంతో ఆ కలుషిత నీటి వల్ల చెరువులోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. పెరికిట్ ఊర చెరువులో పైభాగం నుండి వచ్చి కలుషిత నీరు కలవడం వల్ల చెరువులో చేపలు చనిపోతున్నాయని, చెరువులోకి కలుషిత నీరు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని మత్స్యకారులమైన మా ఉపాధిని కాపాడండి అంటూ పెర్కిట్ కు చెందిన మత్స్యకారులు వేడుకుంటున్నారు. పెరికిట్ ఊర చెరువును అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించి చూస్తే చెరువు నీటి పైభాగాన కుప్పలు కుప్పలుగా మృత్యువాత పడ్డ చేపలు దర్శనమిస్తాయి. ఇదే తరహాలో మున్సిపల్ పరిధిలోని మల్లారెడ్డి చెరువు, కోటార్ మోర్ పెద్ద చిన్న చెరువుల్లో సైతం కలుషిత నీరు కలిసే అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో కూడా చేపలు చనిపోక ముందే ముందస్తుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని మత్స్యకారుల ఉపాధిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పెర్కిట్ ఊర చెరువులో చేపల మృత్యువాత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



