Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విస్తృతంగా గ్రామసభలు..!

విస్తృతంగా గ్రామసభలు..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షత గ్రామభలను విస్తృతంగా నిర్వహించారని మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి తెలిపారు.గ్రామసభలు మండల ప్రత్యేక అధికారి జె.బాపురావు పర్యవేక్షణ చేసినట్లుగా తెలిపారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారి కార్యదర్సులను, గ్రామాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలైన తాగునీరు, పారిశుద్ధ్య పనులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు బండారి నర్సింగం, బండి స్వామి,జంగిడి శ్రీనివాస్, మేకల రాజయ్య,గడ్డం క్రాoతి,కొండ రాజమ్మ,అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్, అక్కల దేవేందర్ యాదవ్, లకావత్ సవేందర్, తాళ్ల రవిందర్ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జిపిల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -