Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలున్యాయం కావాలి..తహసీల్దార్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

న్యాయం కావాలి..తహసీల్దార్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి: తండ్రి ఆస్తిలో వాటా కోసం కోర్టులో కేసు కొనసాగుతుండగా, వివాదంలో ఉన్న భూమిని ఇతరులకు పట్టా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పెట్రోల్‌ పోసుకునేందుకు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బోనగిరి దుర్గయ్యకు ఇద్దరు కూతుళ్లు అందె మల్లిగారి లక్ష్మీ, అందె మల్లిగారి రాజమల్లవ్వ ఉన్నారు. సర్వే నంబర్‌ 565లో దుర్గయ్య పేరున సుమారు 0.36 ఎకరాల భూమి పట్టా ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. అనంతరం ఆ భూమి చిన్న కూతురి పేరున, 2022లో ఆమె కుమారుడి పేరున పట్టా మారిందని పేర్కొంది.

ప్రస్తుతం ఆ భూమిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తండ్రి ఆస్తిలో తన వాటా కోసం కోర్టులో కేసు నడుస్తోందని మహిళ తెలిపింది. కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో భూమిని ఇతరులకు పట్టా చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం జరిగే వరకు పట్టా మార్పులు నిలిపివేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -