నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో నాగుల పంచమి పర్వదినాన్ని మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన మహిళలు, పిల్లలతో కలిసి సమీపంలోని పుట్టల వద్దకు చేరుకున్నారు. పుట్టలకు పూజలు నిర్వహించి పాలు, అరటిపండ్లు, జొన్న పేలాలు, పుట్నాలు తదితర నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నాగదేవతను ప్రార్థించారు. చిన్నారులు సైతం తల్లులతో కలిసి పుట్టల వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నాగుల పంచమి సందర్భంగా పుట్టల వద్ద ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



