Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతండ్రిని చంపిన కుమారుడు

తండ్రిని చంపిన కుమారుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మద్యం మత్తులో తరచూ తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో కుమారుడు తండ్రిని గోతుకోసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌ మండలంలోని అల్లిపూర్‌లో జరిగింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శంకర్(70) కుటుంబం ఉపాధి నిమిత్తం కొన్నీళ్లుగా అల్లిపూర్‌లో ఉంటోంది. బుధవారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి భార్యను వేధించాడు. తట్టుకోలేకపోయిన కుమారుడు తుకారాం తండ్రిని నిలదీయగా గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తుకారం చాకుతో తండ్రిని గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -